Surprise Me!

అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో భారీవర్షాలు || Oneindia Telugu

2019-08-03 197 Dailymotion

The southern coastal districts of the Aegean have a mask and a downpour of rainfall. The only reason for this is the low pressure in the Bay of Bengal. In Krishna, Guntur, Prakasam and Kurnool districts, there are no incessant showers. The district recorded an average rainfall of 20 millimeters on Friday.
#andhrapradesh
#heavyrains
#amaravathi
#weatherreport
#officials
#BayofBengal

ఏపిలోని దక్షిణ కోస్తా జిల్లాల్లో ముసురుపట్టి, ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనమే ఇందుకు కారణమని వాతావరణ శా: అదికారులు చెప్పుకొస్తున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా జల్లులు పడుతున్నాయి. ఈ జిల్లాలో శుక్రవారం సగటున 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. పశ్చిమ గోదావరి జిల్లాలో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ జిల్లాలో సగటు వర్షపాతం 52.3 మిల్లీమీటర్లుగా నమోదైంది. తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీలో పలు ప్రాంతాలతోపాటు మెట్ట, మైదాన, డెల్టా ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఈ జిల్లాలో 2192.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వేటకు వెళ్లిన మత్స్యకారులను తిరిగి రావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. గడిచిన 24గంటల్లో ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో గరిష్ఠంగా 63 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. రెండురోజులుగా వర్షాలతో విశాఖ నుంచి ప్రకాశం జిల్లా వరకు వర్షపాతం మెరుగైంది. ప్రకాశం జిల్లాలో 4.6 మి.మిసాధారణం కన్నా అధికంగా వర్షపాతం నమోదయింది.

Buy Now on CodeCanyon